పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎన్నికల ర్యాలీలో విజయన్ పాల్గొన్నారు.

 ‘‘మతం ఆధారంగా ఏ దేశమూ పౌరసత్వాన్ని ఇవ్వదు. శరణార్థులను మతం ఆధారంగా విభజించదు. కానీ, భారత్ మాత్రం పౌరసత్వాన్ని ఇవ్వడానికి మతాన్ని ప్రాతిపదికగా చేసుకుంటోంది. ఫలితంగా లౌకిక విలువలు నాశనం అవుతున్నాయి" అని ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక నిరసనలలో కమ్యూనిస్ట్ నాయకులు,  జాతీయ  పార్టీల నాయకులు అరెస్టు అయ్యారని చెప్పారు. కానీ, వారిలో కాంగ్రెస్ నేతలు లేరని విమర్శించారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సీఏఏను ఎందుకు వ్యతిరేకించట్లేదని విజయన్ ప్రశ్నించారు.