
తిరువనంతపురం: వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాంధీ భవన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ స్మారక నిధి ట్రస్ట్, ఇతర సంస్థలు నిరాహార దీక్ష చేయనున్నాయి. ఆయా సంస్థలు ఇచ్చిన పిలుపుతో దీక్షలో పాల్గొనాలని గవర్నర్ ఆరిఫ్ నిర్ణయించుకున్నారు. బుధవారం గవర్నర్ దీక్షలో పాల్గొంటారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.