స్కూళ్లలో జుంబా డ్యాన్స్.. వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు !

స్కూళ్లలో జుంబా డ్యాన్స్.. వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు !

స్టూడెంట్స్ కేవలం క్లాసులు, చదువు, పరీక్షలు, హోం వర్క్ అనే దానికే పరిమితం కాకుండా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కేరళ ప్రభుత్వం స్కూళ్లలో జుంబా డ్యాన్ ప్రవేశపెట్టింది. విద్యార్థుల ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ కోసం ప్రతి రోజు జుంబా డ్యాన్స్ చేయించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా డ్యాన్స్ లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు విమర్శలు ఎదురవుతున్నాయి. 

కేరళలో స్కూల్స్ లో జుంబా డ్యాన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వివాదాస్పందా మారింది. యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ డ్యాన్స్ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెబుతుంటే.. ముస్లిం సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గర్ల్స్, బాయ్స్ ఒకే చోట కలిసి డ్యాన్స్ చేయడం.. అందులో పొట్టి డ్రెస్ లతో జుంబా డ్యాన్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ ఏడాది నుంచి జుంబా డాన్స్ ట్రైయినింగ్ ను స్టార్ట్ చేస్తు్న్నట్లు చాలా స్కూల్స్ అనౌన్స్ చేశాయి. దీనిపై ముస్లి సంఘాలా ఆందోళ వ్యక్తం చేస్తున్నాయి.  దీనిపై విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. దీన్ని తాము అంగీకరించమని.. ఈ సెషన్స్ లో తమ కుమారుడు పార్టిసిపేట్ చేయడని ఫేస్ బుక్ పోస్టులో ప్రకటించారు. 

ముస్లిం ఆర్గనైజేషన్ సమస్త సంఘానికి చెందిన మరో లీడర్.. నాసర్ ఫైజీ కూడ్తాయ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేఛ్చ హననం, వల్గారిటీ పెంచినట్లవుతుందని విమర్శించారు. జుంబా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కలిసి చేసే డాన్స్. చిన్న చిన్న డ్రెస్ లు వేసుకుని చేసే డాన్స్. ఇది చాలా అభ్యంతరకరం అని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫిజికల్ ప్రోగ్రామ్స్ ను కాదని.. వల్గారిటీని ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నారు. 

యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగానే.. 

స్కూళ్లలో జుంబా డ్యాన్స్ యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్ లో భాగమేనని కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివంకుట్టీ అన్నారు. ముస్లిం విద్యార్థులు కూడా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లలు సరదాగా ఆడాలి, పాడాలి, లాఫ్, ఫన్, హ్యాపీనెస్ తో పాటు పెరగాలి’’ అని అన్నారు. స్టూడెండ్స్ డ్రెస్ పై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆలోచనలు పిల్లల మనసుల్లో డ్రగ్స్ ను మించిన విషాన్ని నింపుతాయని అన్నారు. ‘పిల్లలు పొట్టి దుస్తులు వేసుకొమ్మని ఎవరూ అడగటం లేదు.. వాళ్లు స్కూల్ యూనిఫామ్స్ వేసుకుంటున్నారని చెప్పారు. 

విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం.. పిల్లలు లెర్నింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలని.. ఇందులో పేరెంట్స్ జోక్యం చేసుకునే అవకాశం లేదని తెలిపారు. ‘‘ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్.. అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా కండక్ట్ చేస్తున్నాం. అలాంటి ఆలోచనలు పిల్లల్లో విభజన సంస్కృతిని డెవలప్ చేస్తాయి’’ అని బదులిచ్చారు.

ఇంతకు ముందు జుంబా డాన్స్ పిల్లలు ఇష్టపూర్వకంగా, వాలంటరీగా చేరేదని, అందరూ చేయాలనే మ్యాండేటరీ రూల్స్ లేవని ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల్లో స్ట్రెస్ తగ్గించి, ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ తో పాటు కాన్ఫిడెన్స్ పెంపొందిచేందుకు అందరూ పార్టిసిపేట్ చేయిస్తున్నట్లు తెలిపింది.  టీచర్లు కూడా జుంబా డాన్స్ కోసం స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంటారు. విద్యార్థులు, టీచర్లు కలిసి జుంబా డాన్స్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీనిపై కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు చాలా మంచి నిర్ణయమని ఆహ్వానిస్తున్నారు.