కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ లు బంద్ అయ్యాయి. ఆ రెండు రాష్ట్రాలకు కేరళ టూరిస్టు బస్సు సర్వీసులు నడిపేది లేదని టూరిస్టు బస్సుల ఓనర్లు పట్టుబట్టి కూర్చున్నారు. టూరిస్టు బస్సుల యాజమాన్యం నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం కూడా సమర్థించింది.దీంతో రెండు రాష్ట్రాలకు వెళ్లే టూరిస్టులు ఇబ్బందుల్లో పడ్డారు. టూరిస్టు లగ్జరీ బస్సుల ఓనర్ల ఇంత పెద్ద నిర్ణయం వెనక అసలు కథేంటీ? ..
కేరళ నుంచి తమిళనాడు ,కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సు యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఏకంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆ రెండు ఆరాష్ట్రాలు వేస్తున్న ట్యాక్స్‌లు మేం భరించలేకపోతున్నాం.. చట్టవిరుద్దంగా ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన స్టేట్స్ ట్యాక్స్‌లు , కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) బస్సులను సీజ్ చేయడంతో తాము నష్టపోతున్నామని, ప్రయాణికులుగా కూడా ఇబ్బందులు పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్టు కింద జారీ చేసిన AITP లు ఉన్నప్పటికీ కేరళ నుంచి వచ్చే టూరిస్టు వాహనాలను తమిళనాడు, కర్ణాటక బార్డర్లలో ఆపి భారీ జరినామాలు విధించడం, బస్సులను సీజ్ చేయడం వంటి చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారని టూరిస్టు బస్సెస్ ఆపరేటర్లు చెబుతున్నారు.
గత సంవత్సర కాలంగా ఇదే కొనసాగుతోంది.. కేరళ రిజిస్ట్రేషన్ ఉండే చాలు ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేస్తున్నారు.. దీంతో ఆపరేటర్లు, ప్రయాణికులు పదే పదే వేధింపులకు గురవుతున్నారు. ఇంతకాలం కేరళ ప్రభుత్వం ఓపికతో ఉంది.. ఆపరేటర్లకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంది.. ఇప్పుడు ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. అందుకే టూరిస్టు బస్సులను నిలిపివేస్తున్నట్లు టూరిస్టు బస్సుల యాజమాన్యం సంఘాలు చెబుతున్నాయి. కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలంటున్నారు.
