ఇంట్లోనే ప్రసవం చేయాలని పట్టుబట్టిన భర్త పరిస్థితి విషమించి తల్లి, బిడ్డ మృతి

ఇంట్లోనే ప్రసవం చేయాలని పట్టుబట్టిన భర్త పరిస్థితి విషమించి తల్లి, బిడ్డ మృతి

గర్భంతో ఉన్న భార్యని ఇంట్లోనే ప్రసవం చేయాలని ఆమె భర్త పట్టుబట్టాడు. సరైన వైద్యం అందక డెలివరీ టైంలో తల్లి, బిడ్డా చినపోయిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలోని కరక్కమండలంలోని షమీరా(36), నయాజ్  దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. షమీరా గతంలో ముగ్గురు పిల్లలకు జన్మనించింది. నాల్గవ సారి ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఆమె హాస్పిటల్ కు పోయి డాక్టర్లును సంప్రదించలేదు. 

హాస్పిటల్ కి వెళ్లమని ఆశా వర్కర్లు చెప్పిన అందుకు ఆమె భర్త అంగీకరించలేదు.  ఆన్‌లైన్‌లో చూస్తూ ఆక్యుపంక్చర్‌ వైద్యం ద్వారా ఇంట్లోనే బిడ్డను ప్రసవించాలని ఆ జంట ప్రయత్నించారు. అయితే మంగళవారం సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయినా ఆమెను ఆస్పత్రిలో చేర్పించలేదు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. డెలివరీ కష్టమెంది. వెంటనే ఆమెను కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే షమీరా,శిశువు మృతి చెందారు. దీంతో మృతురాలి భర్త నయాజ్​పై నెమోమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.  షమీరా మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని స్థానికులు అన్నారు. ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.