2011 జనాభా లెక్కలతో.. రిజర్వేషన్లు అమలు చేయాలి: కె.కేశవరావు

2011 జనాభా లెక్కలతో.. రిజర్వేషన్లు అమలు చేయాలి: కె.కేశవరావు

న్యూఢిల్లీ, వెలుగు : 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని, మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే సరిపోయేదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే అంశం చాలా సుదీర్ఘ కాలంగా చర్చలో ఉందని, కేంద్రం తెచ్చిన ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున కేకే, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అనే కండీషన్లు ఉన్నాయన్నారు. 

దీని ప్రకారం జనాభా లెక్కలు, డీలిమిటేషన్, ప్రజాభిప్రాయం తర్వాత ఈ బిల్లు రావాలంటే 2023 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. అంటే 2024, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ బిల్లు అమలయ్యే అవకాశం లేదని, దాదాపు 2031 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా లెక్కలు అనేవి ప్రతికూల అంశమని, ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగా ఇక్కడ జనాభా తక్కువగా నమోదైందని చెప్పారు. కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కు..

మహిళా రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అందుకే ఈ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాడిందని కేకే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మహిళా శక్తి ప్రతీకగా నిలిచిందని ఎంపీ వద్ది రాజు రవిచంద్ర అన్నారు. 

రుద్రమదేవి నుంచి సమ్మక– సారాలమ్మ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ మహిళా ధీరత్వాన్ని ప్రదర్శించారని కొనియాడారు. తెలంగాణ సర్కార్ మహిళా సాధికారత కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.