అయోధ్యలో KFCనా.. ఏంటి రామా..

అయోధ్యలో KFCనా.. ఏంటి రామా..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత  సందర్శకుల తాకిడి ఎక్కువైంది.  బాలక్ రాముడిని చూసేందుకు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు  పోటెత్తుతున్నారు.  జనవరి 29 వరకు దాదాపు 19 లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నారు.  అయోధ్యకు వచ్చే భక్తుల ఆకలి తీర్చడానికి నగరంలో అనేక రెస్టారెంట్లు వచ్చాయి. 

డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్  రెస్టారెంట్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి.  అయితే అవి నాన్ వెజ్ ఫుడ్ లకు దూరంగా ఉంటూ తమ వ్యాపారాలను నడుపుతున్నాయి.  రామ మందిరం చుట్టూ 15 కి.మీ ఉన్న పంచ్ కోసి మార్గ్ పరిధిలోని ప్రాంగణంలో మద్యం, మాంసం అమ్మకాలను అధికారులు అనుమతించరు. రామమందిర శంకుస్థాపనకు ముందు,  మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  

దీంతో పూర్తి వెజ్ ఐటమ్స్ తోనే ఇక్కడి రెస్టారెంట్లు నడుస్తున్నాయి. త్వరలో ఇక్కడ ఫ్రైడ్ చికెన్ ఐటెమ్‌లకు ప్రసిద్ధి చెందిన కేఎఫ్సీ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.  పూర్తి శాకాహార ఫుడ్ తో  కేఎఫ్సీ రెస్టారెంట్ నిర్వహిస్తే..  స్థలం కూడా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా  అధికారి ఒకరు వెల్లడించారు.