సమస్యలు పరిష్కరించండి...కేజీబీవీ ఉపాధ్యాయుల ఆందోళన.. తమ పిల్లలతో వర్షంలో తడుస్తూ...

సమస్యలు పరిష్కరించండి...కేజీబీవీ ఉపాధ్యాయుల ఆందోళన.. తమ పిల్లలతో వర్షంలో తడుస్తూ...

హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు కేజీబీవీ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కేజీబీవీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు కేజీబీవీ టీచర్లు నిరసన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లల వెంటపెట్టుకుని మరీ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు బైఠాయించారు. ఉపాధ్యాయుల నిరసనకు  టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావడంతో స్కూల్ ఎడ్యకేషన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

కేజీబీవీ ఉపాధ్యాయ..ఉద్యోగుల డిమాండ్స్

  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేజీబీవీ, యుఆర్ఎస్  ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న పోస్ట్ కు కనీస వేతనం (బేసిక్ పే ) చెల్లించాలి.
  •  ఎస్ఓను ప్రిన్సిపాల్ గా, పిజిసిఆర్జీలను జెఎల్స్ గా, సిఆర్టీలను స్కూల్ అసిస్టెంట్స్ గా, పిఈటిలను పిడిలుగా గుర్తించి ఆ పోస్ట్ యొక్క బేసిక్ పేను ఇవ్వాలి. 
  • పిఆర్సీ సిఫారసు చేసిన విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కేజీబీవీ , యుఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు సిఎల్స్ వినియోగానికి అర్హత కల్పించాలి. 
  • హాస్టల్ నిర్వహణ కోసం కేర్ టేకర్ ను నియమించాలి. సిఆర్టీలకు నైట్ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలి.
  • కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలి