తొలి పూజకు వేళాయే..  అన్ని ఏర్పాట్లు చేసిన  ఉత్సవ కమిటీ

తొలి పూజకు వేళాయే..  అన్ని ఏర్పాట్లు చేసిన  ఉత్సవ కమిటీ
  •  నేటి ఉదయం 9 గంటలకు బడా గణేశ్​ ప్రారంభ పూజ  

హైదరాబాద్, వెలుగు:  నవరాత్రులకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేశ్ తొలిపూజ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉదయం 11గంటలకు నిర్వహించే పూజ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిపూజ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు.  

Also Raed :- రెండు నెలలుగా కాళేశ్వరం గేట్లు ఖుల్లా.. సముద్రంలోకి 1000 టీఎంసీల గోదావరి నీళ్లు

భక్తుల  రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.    

గవర్నర్ కు ఆహ్వానం 

 బడా గణేశ్​  తొలిపూజలో పాల్గొనాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించారు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్, వైస్ ప్రెసిడెంట్  మహేష్ యాదవ్,  ఆర్గనైజర్ రాజ్ కుమార్ లు ఉన్నారు.