ఖైరతాబాద్, వెలుగు : ఈ నెల 17న ఖైరతాబాద్ బడా గణేశ్ నిర్మాణానికి కర్రపూజ నిర్వహిస్తున్నట్లు శ్రీగణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. శనివారం ఖైరతాబాద్‌లోని ఆలయం వద్ద కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నిర్జల ఏకాదశి నాడు వినాయక విగ్రహ నిర్మాణానికి కర్ర పూజ చేస్తున్నామన్నారు.
ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి యం.మహేందర్ బాబు పాల్గొన్నారు.