ఇంత త్వరగానా : ట్యాంక్ బండ్ ఎక్కేసిన ఖైరతాబాద్ గణనాథుడు

ఇంత త్వరగానా : ట్యాంక్ బండ్ ఎక్కేసిన ఖైరతాబాద్ గణనాథుడు

హైదరాబాద్ సిటీ గణేష్ నిమజ్జనం అనగానే మొదటగా అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. ఈ గణేషుడును చూడటానికే లక్షలాది మంది జనం ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలి వస్తుంటారు. ఇక ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అంటే.. ఏ రాత్రికో.. తర్వాత రోజు మధ్యాహ్నానానికో అవుతుంది అనుకుంటారు భక్తులు. ఈ గణనాధుడుని చూసేందుకు లక్షల మంది ఎన్టీఆర్ మార్గ్ చేసుకుంటారు.

ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం.. నిమజ్జనంతోనే అందరి కళ్లు ఉంటాయి. ఈ ఏడాది గణేష్ నిమజ్జనం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సెప్టెంబర్ 28వ తేదీ గణేష్ శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. ఎప్పుడో రాత్రికి ఖైరతాబాద్ గణణాథుడి నిమజ్జనం అనుకుంటే.. ఎవరూ ఊహించని విధంగా ఉదయం 11 గంటలకే ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంది. 

అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరకు రావటానికి మరో గంట అంటే.. ఒంటి గంటకు క్రేన్ దగ్గరకు చేరుకున్నా.. మరో గంట అంటే మధ్యాహ్నం 2 గంటల నాటికి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు పోలీసులు.ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ఇంత త్వరగా జరగటంపైనే భక్తులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ కు శోభాయాత్ర చూడటానికి ఇళ్ల నుంచి జనం బయలుదేరక ముందే.. అతి పెద్ద విగ్రహం చేరుకోవటం అందరినీ నిరుత్సాహ పరుస్తుంది.