కెనడాకు జాతీయ భద్రతా ముప్పుగా ఖలిస్తానీ తీవ్రవాదులు..హెచ్చరించిన సీఎస్ఐఎస్

కెనడాకు జాతీయ భద్రతా ముప్పుగా ఖలిస్తానీ తీవ్రవాదులు..హెచ్చరించిన సీఎస్ఐఎస్

ఒటావా: కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ దేశానికి జాతీయ భద్రతా ముప్పుగా మారారని కెనడియన్​సెక్యూరిటీ ఇంటెలిజెన్స్​సర్వీస్(సీఎస్ఐఎస్) హెచ్చరించింది. తమ హింసాత్మక ఎజెండాను ప్రచారం చేయడానికి వారు కెనడాలోని సంస్థలను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

సీఎస్ఐఎస్​ గత శుక్రవారం విడుదల చేసిన తన 2025 వార్షిక నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. కెనడాలోని కొందరు ఖలిస్తానీ తీవ్రవాదులు సామాన్య పౌరుల నుంచి సేకరించిన నిధులను హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని తెలిపింది.