భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి : శ్రీనివాసరెడ్డి

భూభారతి  దరఖాస్తులు పరిష్కరించాలి : శ్రీనివాసరెడ్డి
  • అడిషనల్ ​కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

తల్లాడ వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏన్కూర్, తల్లాడ తహసీల్దార్ ఆఫీస్ లో ఆయన తనిఖీలు చేశారు. దరఖాస్తుల స్థితిగతులు, భూభారతి పోర్టల్ పై చర్చించి పలు సూచనలు చేశారు. ఏన్కూర్ లోని కేజీబీవీలో డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించారు. స్టూడెంట్స్ కు పౌష్టికాహారం అందించాలని సూచించారు. సీజనల్​ వ్యాధుల బారినపడుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలి 

ఖమ్మం టౌన్ :  ప్రశాంత వాతావరణంలో గణేశ్​ఉత్సవాలను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో గణేశ్​
ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్​డీవో పద్మశ్రీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేశ్​ఉత్సవాలు ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మండపాల వారు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఎంహెచ్​వో కళావతి బాయి, కేఎంసీ కమిషనర్​ అనిల్ కుమార్, గణేశ్​ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.