- ముగిసిన మొదటి విడత నామినేషన్ విత్ డ్రా
- ఖమ్మం జిల్లాలో 19 మంది సర్పంచ్ లు, 220 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవం
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత బరిలో నిలిచిన వారి లెక్క తేలింది. బుధవారం నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియడంతో గ్రామాల వారీగా సర్పంచ్, వార్డు మెంబర్స్థానాలకు ఎంతమంది పోటీలో ఉన్నారనే క్లారిటీ వచ్చింది. ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 192 గ్రామాల్లో మొత్తం 1,142 నామినేషన్లు రాగా.. 215 తిరస్కరణకు గురయ్యాయి. 1,740 వార్డులకు దాఖలైన 4,054 నామినేషన్లలో అధికారులు 73 తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 438 మంది సర్పంచ్, 3,445 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
జిల్లాలో మొదటి విడతలో 8 మండలాల్లోని 159 సర్పంచ్ స్థానాలకు 813 నామినేషన్లు, 1,436 వార్డు స్థానాలకు 3,480 నామినేషన్లు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు..
జిల్లాలో మొదటి విడతలో మొత్తం 192 గ్రామ పంచాయతీలకు గానూ19 గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనకల్ మండలంలో కలకోట, చింతకాని మండలంలో రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర మండలంలో సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, ఎర్రుపాలెం మండలంలో గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం, వైరా మండలంలో లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, పుణ్యపురం, రఘునాథపాలెం మండలంలో మల్లేపల్లి, రేగుల చలక, మంగ్య తండా, రాములు తండా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం1,740 వార్డులకు గానూ 220 ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.
కొత్తగూడెంలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో దుమ్ముగూడెం, కోయనర్సాపురం, దబ్బనూతల కొత్తూరు, గంగోలు, పెద్ద కమలాపురం, బూర్గంపాడు మండలంలో లక్ష్మీపురం, మోరంపల్లి బంజర, పినపాక పట్టీనగర్, కృష్ణసాగర్, టేకులచెరువు, పినపాక మండలంలో జగ్గారం, పాతరెడ్డిపాలెం, కిష్టాపురం, అశ్వాపురం మండలంలోని చండ్రలబోడు, అశ్వారావుపేట మండలంలోని మద్దికొండ, రామన్నగూడెం... మొత్తం 16 సర్పంచ్‌స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
రెండో విడతలో పాల్వంచ మండలంలోని సంఘం గ్రామపంచాయతీతోపాటు పాల్వంచ, అశ్వారావుపేట మండలాల్లో 13 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.
మూడో విడత నామినేషన్లు షురూ..
ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు 191 గ్రామాలకు గానూ 90 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 1,742 వార్డులకు గానూ 237 మంది నామినేషన్ వేశారు.
ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్లు
మండలం గ్రామాలు సర్పంచ్‌కు వార్డులు వార్డు స్థానాలకు
కామేపల్లి 24 108 218 514
ఖమ్మం రూరల్ 21 148 202 574
కూసుమంచి 41 250 364 853
ముదిగొండ 25 166 246 665
నేలకొండపల్లి 32 161 300 663
తిరుమలాయపాలెం 40 222 356 891
మొత్తం 183 1055 1686 4160
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత నామినేషన్లు
మండలం గ్రామాలు సర్పంచ్ కు వార్డులు వార్డు స్థానాలకు
అన్నపురెడ్డిపల్లి 10 43 98 273
అశ్వారావుపేట 27 145 234 529
చంద్రుగొండ 14 74 134 388
చుంచుపల్లి 18 101 168 503
దమ్మపేట 31 152 290 658
ములకలపల్లి 19 114 178 469
పాల్వంచ 36 169 282 645
మొత్తం 155 798 1384 3465
