పశువైద్యశాలను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పశువైద్యశాలను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కామేపల్లి, వెలుగు : కామేపల్లి పశువైద్యశాలను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకుముందు పీహెచ్​సీని పరిశీలించారు. సమస్యలపై ప్రజలను ఆరా తీశారు. వైద్యశాలలో  సిబ్బంది, సరిపోను  అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 

పశువైద్యాశాల శిథిలావస్థకు చేరడంతోపాటు ఇక్కడ సరైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని  రైతులు కలెక్టర్​దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.