ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  •     ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమైనందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.