సదరమ్ కార్డుల జారీని వేగవంతం చేయాలి  : కలెక్టర్ దివాకర

సదరమ్ కార్డుల జారీని వేగవంతం చేయాలి  : కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరమ్​ యూడీఐడీ కార్డులు సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈవో దివ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న కలెక్టర్, జిల్లాలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని చెరువులు, సరస్సులు, నదీ తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి జిల్లాను ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

పర్యాటక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సెర్ప్ కార్యక్రమాలను లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి, స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. వీవో భవనాల నిర్మాణం, బ్యాంకు లింకేజీ, రుణాల వసూళ్లు, పీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంఈ యూనిట్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

మరిన్ని వార్తలు