ప్రజాసేవకు ముందుకు రావడం అభినందనీయం : ఖమ్మం కలెక్టర్ దివాకర

ప్రజాసేవకు ముందుకు రావడం అభినందనీయం : ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజలకు సేవ చేసేందుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని ఖమ్మం కలెక్టర్ దివాకర ప్రశంసించారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌సీయూ)లో ఏర్పాటు చేసిన రూ.9 లక్షల విలువైన వివిధ ఆధునిక వైద్య పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వైద్య సేవల విస్తరణకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు. 

కల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్, కల్లా ఫౌండేషన్ చైర్మన్ పాపారావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వల్లభనేని రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్​ ఇరిగేషన్, హార్టికల్చర్, వ్యవసాయశాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా పంట అవశేషాలను కాల్చితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.​​