ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం కాలేజీలకు తాళాలు

ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం కాలేజీలకు తాళాలు

ఖమ్మం, వెలుగు:  గత మూడేండ్లుగా పెండింగ్ ఉన్న విద్యార్థుల రీయంబర్స్​ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లాలో బీటెక్, డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీల బంద్​ రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరగాల్సిన బి. ఫార్మసీ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించి, మేనేజ్ మెంట్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పీజీ కాలేజీ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీల మేనేజ్ మెంట్లు సమావేశమై మాట్లాడుతూ బకాయిలను ప్రభుత్వం చెల్లించేంతవరకు బంద్ పాటిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో మేనేజ్​మెంట్ బాధ్యులు ఆర్జేసీ కృష్ణ, కాటేపల్లి నవీన్ బాబు, బొమ్మ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.