- హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, మంత్రులు, పీసీసీ చీఫ్
ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ నాయకులు, దివంగత జావీద్ సేవలు మర్చిపోలేనివని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జావీద్ సంతాప సభను ఆదివారం ఖమ్మం రెడ్‌హిల్స్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ... జావీద్ లేని లోటు కనిపిస్తోందన్నారు. జావీద్ కుటుంబానికి, ఇద్దరు పిల్లలకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనతో పాటు ఎంపీ రఘురాం రెడ్డి గెలుపు కోసం జావీద్ ఎంతో కృషి చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... జావీద్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. సంతాప సభకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు, కొండబాల కోటేశ్వరరావు, బాలసాని లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
