భద్రాచలంలో గంజాయి పట్టివేత

భద్రాచలంలో గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో బుధవారం రెండు వేర్వేరు ఘటనల్లో ఖమ్మం జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్​ ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. కూనవరం రోడ్డులోని ఎంవీఐ ఆఫీస్​ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కేరళకు కారులో 30.600 కిలోల ఎండు గంజాయిని తరలిస్తూ కేరళకు  చెందిన నజీర్​పుతియా వేటిల్, జకారియా పారాయిల్​ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరో యువకుడు రవి యమహా బైక్​పై 21.300 కిలోల ఎండు గంజాయిని తరలిస్తూ పోలీసులను చూసి వాహనం వదిలేసి పారిపోయాడు. అతడు కూడా కారులో పట్టుబడిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు దాడుల్లో రూ.26 లక్షల విలువైన 51.900 కిలోల గంజాయిని సీజ్​ చేసినట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.