.. ఖమ్మం జిల్లా యడ్ల బంజరుగ్రామ పంచాయితీకి 20 ఏళ్ల తరువాత ఎన్నికలు

  .. ఖమ్మం జిల్లా  యడ్ల బంజరుగ్రామ పంచాయితీకి 20 ఏళ్ల తరువాత ఎన్నికలు

పెనుబల్లి, వెలుగు : రెండు దశాబ్దాల కింద తోడికోడళ్లు సర్పంచ్‌‌ బరిలో దిగగా.. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు సర్పంచ్‌‌ బరిలో నిలుస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీ ఎస్టీ జనరల్‌‌కు రిజర్వ్‌‌ అయింది. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి మధ్యే పోటీ నెలకొంది. 

1996లో జరిగిన ఎన్నికల్లో ఈ గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వ్‌‌ అయింది. దీంతో అప్పుడు తోడి కోడళ్లు రాజిన్ని సునీత, రాజిన్ని సుభద్ర పోటీపడగా సునీత విజయం సాధించింది. ఆ తర్వాత సునీత, ఆమె భర్త రాంబాబు మూడు సార్లు సర్పంచ్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సారి రిజర్వేషన్‌‌ ఎస్టీ జనరల్‌‌ కావడంతో అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్‌‌ బరిలో నిలుస్తున్నారు. 20 ఏండ్ల తర్వాత ఈ గ్రామంలో ఎన్నికలు జరగడం విశేషం.