
హైదరాబాద్: 11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఖమ్మం ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. జూనియర్ బాయ్స్, బాలికల అండర్ 14, 16, 18, 20, మెన్స్, విమెన్స్‌లో మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టింది.
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్, హనుమకొండ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలు మంగళవారం ముగిశాయి. మెన్స్ టీమ్ చాంపియన్‌షిప్‌ను రంగారెడ్డి జిల్లా గెలుచుకోగా, అండర్–16 గర్ల్స్ టీమ్ చాంపియన్‌షిప్‌ను హనుమకొండ కైవసం చేసుకుంది.