మేయర్ పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కార్పోరేటర్లు

మేయర్ పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కార్పోరేటర్లు

ఖమ్మం మేయర్ పాపాలాల్ ను తొలగించాలంటూ చేసిన తీర్మాన ప్రతిని ఎమ్మెల్యే అజయ్ కుమార్ కు అందజేసిన జిల్లా కార్పొరేటర్లు. మేయర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన 36 మంది కార్పొరేటర్లు శనివారం ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. సమావేశంలో మేయర్ పాపాలాల్ తీరు ను వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. డివిజన్ల లో పర్యటనలకు వచ్చి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

వారి ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే.. మేయర్ తో మాట్లాడి, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తానని అన్నారు. పార్టీకి నష్టం జరిగే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించబోనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే పాటుపడుతోందని, సీఎం కేసీఆర్ ఏం చెబితే అలా నడుచుకుంటామని ఎమ్మెల్యే అజయ్ అన్నారు. సమస్యపై సత్వరం స్పందిస్తామని, ఇంతకన్నా ఎటువంటి పరిణామాలు జరుగబోవని కార్పోరేటర్లకు హామీ ఇచ్చారు అజయ్ కుమార్.