కేసీఆర్..మోడీ.. కుతంత్రాల కింగ్స్: రేణుకా చౌదరి

కేసీఆర్..మోడీ.. కుతంత్రాల కింగ్స్: రేణుకా చౌదరి

ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కుతంత్రాలకు కింగ్స్ అని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జిల్లాలో పర్యటిస్తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని నియంతల్లా పరిపాలించారన్నారు. ఇలాంటి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఏ మేలు జరుగుతుందని ఆమె ప్రశ్నించారు.

ఎన్నికల ప్రచార సమయంలో తాము బస చేస్తున్న విడిది గృహల్లో.. తామెవరు లేని సమయంలో అధికారులు దాడులు చేయడంపై రేణుకా చౌదరి మండిపడ్డారు.  ఒకవేళ మీరే  రూమ్ లలో ఏదైనా పెడితే దానికి ఎవరు భాద్యులు .? ఆమె ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా.. తమ గదుల్లో దాడిచేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అధికార పార్టీయే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు.

అధికార పార్టీ భయపెడితే భయపడ్డానికి.. తామేమీ టీఆర్ఎస్ కార్యకర్తలం కాదని అన్నారు. ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తనపై, తమ పార్టీ మహిళలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు , నీతిమాలిన రాజకీయాలకు భయపడేది లేదన, తన జాతకంలో భయమన్న మాటకు  స్థానం లేదని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రంలో సరైన రాజకీయాలను తీసుకొస్తానని ఆమె అన్నారు.