క్రికెట్‌‌‌‌కు ఖవాజా గుడ్‌బై.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టే చివరిదని వెల్లడి

క్రికెట్‌‌‌‌కు ఖవాజా గుడ్‌బై.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టే చివరిదని వెల్లడి
  • కెరీర్‌‌‌‌లో జాతి వివక్ష ఎదుర్కొన్నానన్న ఆసీస్ క్రికెటర్‌‌

సిడ్నీ: ఆస్ట్రేలియా వెటరన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌ ఖవాజా.. ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే యాషెస్‌‌‌‌ ఐదో టెస్ట్‌‌‌‌ తర్వాత ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పనున్నాడు. పాకిస్తాన్‌‌‌‌లో జన్మించిన ఖవాజా.. ఆసీస్‌‌‌‌ తరఫున క్రికెట్‌‌‌‌ ఆడిన తొలి ముస్లింగా నిలిచాడు. అయితే తన కెరీర్‌‌‌‌లో ఎన్నోసార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నానని 39 ఏళ్ల ఖవాజా తెలిపాడు. ‘నేను ముస్లిం అయిన కారణంగా ఇప్పటి వరకు కొంచెం భిన్నంగా చూసుకున్నారు. నాతో వ్యవహరించిన విధానం కూడా భిన్నంగానే ఉంది. 

వెన్ను నొప్పిని నేను నియంత్రించుకోలేకపోయా. కానీ మీడియా, మాజీ ప్లేయర్లు నాపై విమర్శలు మొదలుపెట్టారు.  సోమరి అని ముద్ర వేశారు. పాక్​, విండీస్‌‌‌‌ ఆటగాళ్లు, నల్ల జాతీయలు స్వార్థపరులు అన్నారు. మా గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటాం. జట్టు గురించి పట్టించుకోమని వ్యాఖ్యలు చేశారు’ అని ఖవాజా పేర్కొన్నాడు. ఖవాజా87 టెస్ట్‌‌‌‌ల్లో 16 సెంచరీలు, 28 హాఫ్‌‌‌‌ సెంచరీలతో 6206 రన్స్‌‌‌‌ చేశాడు.