ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు

ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు

న్యూఢిల్లీ: మన దేశంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ఖేల్ రత్న అవార్డు పేరు మారింది. ఇప్పటి నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పిలవనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ కన్ఫర్మ్ చేశారు. ఖేల్ రత్న పేరును మార్చాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి తమకు వినతులు అందాయని.. జనాల సెంటిమెంట్లను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ ట్వీట్ చేశారు. 

‘ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు. భారత్‌కు గౌరవం, పేరుప్రతిష్టలు తీసుకొచ్చిన ప్లేయర్‌గా మేజర్ ధ్యాన్ చంద్‌ను చెప్పుకోవాలి. ఆయన మన దేశానికి గర్వకారణం. అందుకే భారత అత్యుత్తమ క్రీడా పతకానికి ఆయన పేరును పెడుతున్నాం’ అని మోడీ పేర్కొన్నారు. ఇంతకు ముందు వరకు ఖేల్ రత్న అవార్డును రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలిచేవారు.