పంజాగుట్ట, వెలుగు: ఖర్జూర రైతులకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి, దేశీయంగా ఖర్జూర ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్పీక్ సంస్థ అధ్యక్షుడు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్ కోరారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఖర్జూర రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విదేశాల నుంచి ఖర్జూర పండ్లను దిగుమతి చేసుకోవడం కంటే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం మంచిదన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖర్జూర పంటను కొంత మంది రైతులు మాత్రమే పండిస్తున్నారని తెలిపారు. ఖర్జూరం పెంపకం, వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. దేశీయంగా పండించిన పండ్లలో పోషక విలువలు, శ్రేష్టత ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఖర్జూర రైతులు ఎల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి
పాల్గొన్నారు.
