
న్యూఢిల్లీ : జాతీయ మహిళ కమిషన్ మెంబర్గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం పోస్ట్ చేశారు. " ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించిన ప్రధాని మోడీకి, కేంద్రానికి కృతజ్ఞతలు. మీ నాయకత్వం లో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారీ శక్తిని రక్షించడానికి కృషి చేస్తాను" అని ఖుష్బూ ట్వీట్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నియామ కం పట్ల బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై హర్షం వ్యక్తంచేశారు. సినిమా యాక్టర్ ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2021లో బీజేపీలో చేరారు. మమతా కుమారి, డెలినా ఖోంగ్డుప్ కూడా మహిళ కమిషన్ మెంబర్గా నియమితులయ్యారు.