
సౌత్..నార్త్ అనే తేడా లేకుండా కియారా అద్వానీ ఆఫర్లు పట్టేస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌ఛేంజర్’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో కియారా నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రాంచరణ్‌తో ఈ బ్యూటీకిది రెండో సినిమా. ఒక్కో సినిమాకు ఈ హీరోయిన్ 3 నుంచి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది.
తాజాగా కియారా పిక్స్ చూస్తే ఇది నిజమేనంటారు. ఓ సినిమా కోసం డబ్బింగ్ స్టూడియోకు వచ్చిన కియారా లగ్జరీ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. బ్లాక్ కలర్ మెర్సిడెస్ మే బ్యాక్ కారులో దిగుతూ ఆమె మీడియా కంట పడింది. దీరి ధర దాదాపు మూడు కోట్లకు పైమాటే. ఈ కారులో కియారా ఫొటోలు వైరల్‌గా మారాయి. తన తోటి నటీమణులతో పోలిస్తే అత్యంత వేగంగా స్టార్ డమ్ అందుకున్న నటిగా కియారా పేరు వినిపిస్తోంది.
ప్రస్తుతం ‘సత్యప్రేమ్‌కి కథ’ అనే రొమాంటిక్ కామెడీలోనూ నటిస్తోంది. ఇవే కాకుండా ఏడాదికి కనీసం నాలుగైదు సినిమాలు తగ్గకుండా చూసుకుంటోందట.