సినిమాలతో కంటే వెబ్ సిరీస్ తోనే మొదట పాపులర్ అయ్యింది కియారా అద్వానీ., లస్ట్ స్టోరీస్’తో ఆమె సృషించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి వెబ్ సిరీస్ తోనే అందరి ప్రసంశలు అందుకుంటోంది. ‘గిల్టీ’ వెబ్ సిరీస్ ద్వారా దేశాన్ని దాటి ఇతర దేశాల్లోనూ పాపులర్ అయ్యింది. టాలీవుడ్లో ‘భరత్ అను నేను’తో మంచి మార్కులు వేయించున్న కియారా.. ‘కబీర్ సింగ్’తో భేష్ అనిపించుకుంది. రీసెంటుగా ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఒక ప్రేమికురాలిగా మంచి పాత్ర చేసి భళా అనిపించుకుంది. ఆమె ఇమేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందంటే.. గల్ఫ్ కంట్రీలోని ఫేమస్ మేగజైన్లో ఒకటైన ‘గల్ఫ్ న్యూస్ టాబ్లాయిడ్’ కవర్ పేజీపై కియారా ఫోటోని ప్రచురించారు. అంతేకాదు ఈ మేగజైన్లో ఆన్ ట్రయల్ అనే ఎక్స్ క్లూజివ్ స్టోరీని కూడా కియారా గురించి రాశారు. అందులో ‘గిల్టీ’ వెబ్ చిత్రంలో కియారా చేసిన రోల్ గురించి వివరంగా రాశారట. ఇండియన్ మేగజైన్ల కవర్ పేజీలనే కాకుండా అటు ఇంటర్నేషనల్ మేగజైన్ల కవర్ పేజీలను కూడా కవర్ చేస్తూ నేషనల్ టు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతోందంటే పర్ఫెక్ట్ ఫ్యూచర్‌ని ప్లాన్ చేసుకున్నట్టే ఉంది కియారా. ప్రస్తుతం భూల్ భులయ్యా 2, లక్ష్మి బాంబ్, షేర్ షా, ఇందూ కీ జవాని మొదలైన ప్రాజెక్టులు చేస్తోంది. మరి ఇంకా ఏ స్థాయికి ఎదుగుతుందో చూడాలి.
