
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఇటీవల హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి కియారా ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇటీవల కొన్ని ఫొటోల్లో ఆమె బేబీ బంప్‌తో కనిపించిందంటూ వార్తలు వచ్చాయి. తర్వాత అందులో నిజం లేదని తెలిసింది. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. 2019లో ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తనకు మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఉందని కియారా తెలిపింది.
తన ప్రెగ్నెన్సీ టైంలో నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా ఉంటానని చెప్పింది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు.. ఎలా ఉన్నా పరవాలేదంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. దీంతో ఈ నటి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కియారా మాత్రం కెరీర్ చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం రాంచరణ్‌తో ‘గేమ్‌ఛేంజర్’లో నటిస్తోంది.