రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1950-70ల గోవా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్ మాఫియా కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇపుడు ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్పై ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యూటీ కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ఆడియన్స్లో హీట్ పెంచేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ ‘టాక్సిక్’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ సెట్స్‌లోకి వచ్చిన తర్వాత ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పకుండా నేరుగా పాత్ర మూడ్‌లోకి వెళ్లాలని తనకు సూచించిందని తెలిపారు. దీంతో రోజంతా క్యారెక్టర్ జోన్‌లోనే ఉండాల్సి వచ్చేదని చెప్పారు.
భాషా పరమైన సవాళ్లు:
‘టాక్సిక్’ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూట్ చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందని కియారా వెల్లడించారు. ఈ క్రమంలోనే కన్నడ డైలాగులు నేర్చుకోవడానికి షూటింగ్‌కు ముందు రాత్రంతా ప్రాక్టీస్ చేసేదాన్నని చెప్పారు. ఈ పాత్ర చేయడం తన జీవితంలోనే అత్యంత కష్టమైనదిగా కియారా స్వయంగా పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా మరియు భావోద్వేగపరంగా ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో కియారా ‘నాడియా’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యూటీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ గౌన్‌లో కియారా లుక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.
ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్:
మరో ఆసక్తికర విషయాన్ని కూడా కియారా వెల్లడించారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలోనే, దాదాపు ఏడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నానని, ఆ విషయం దర్శకురాలు, నిర్మాతకు మాత్రమే తెలుసని చెప్పారు. అలాగే ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడే Met Galaలో పాల్గొన్నానని, ఆ అనుభవాన్ని తన కుమార్తె సైరయ్యాతో కలిసి పంచుకున్న ప్రత్యేక క్షణంగా భావిస్తున్నట్లు కియారా పేర్కొన్నారు
#KiaraAdvani on #Toxic with #Yash :
— cinee worldd (@Cinee_Worldd) May 29, 2026
"This will change the perception of the heroine character in a movie, even I am shocked after listening to my character's narration" pic.twitter.com/CefG65awXM
టాక్సిక్ విషయానికొస్తే.. ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు.
కియారా అద్వానీ సినిమాలు..
హీరోయిన్స్‌కు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గుతాయనేది పాత మాట. కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ పెళ్లి తర్వాత మరింత బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో జోరుమీదుంది. ఓ వైపు బాలీవుడ్ సినిమాలు, మరోవైపు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉందామె. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ అనగానే మొదటి పేరు కియారాదే వినిపిస్తోంది. గతేడాది రామ్ చరణ్‌కు జంటగా ‘గేమ్ చేంజర్’లో నటించింది. వార్ 2 లో సైతం నటించింది. కన్నడలో ఎంట్రీ ఇస్తూ టాక్సిక్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ప్రస్తుతం హిందీలో ‘డాన్’ ప్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘డాన్ 3’లో రణ్‌వీర్ సింగ్‌కు జంటగా నటిస్తోంది. మొత్తానికి వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతోంది కియారా అద్వానీ. ఇకపోతే, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలై 15, 2025 న ఒక పాప జన్మించింది. ఈ పాపకు సారాయా మల్హోత్రా అని పేరు పెట్టారు. 'సారాయా' అంటే హెీబ్రూ భాషలో 'దేవుని రాజకుమారి' అని అర్థం.
