బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని పేరు కియారా అద్వానీ. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె.. ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్స్‌కు కొంత బ్రేక్ ఇచ్చింది. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఫుల్ స్వింగ్‌తో స్టార్ట్ చేసిన ఆమె.. తాజాగా ఓ అవార్డు వేడుకలో తన అభిమానులకు ఇలా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఓ ఫిలిం అవార్డ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. చాక్లెట్ కలర్ బాడీ-హగ్గింగ్ లెదర్ గౌన్‌లో సర్‌ప్రైజ్ చేసింది. ఈ ఔట్ ఫిట్‌లో ఆమె అత్యంత ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. ‘మమ్మి ఇంటికి వచ్చింది.. ఇంకా చాక్లెట్ కూడా తెచ్చింది” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ షేర్ చేసింది.
బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్, తన గ్లామర్‌ను, డ్రెస్ తాలూకు స్వీట్ అండ్ హాట్ లుక్‌ను సూచిస్తూ ఇలా క్రియేటివ్ క్యాప్షన్ ఇచ్చింది. కొంత గ్యాప్ తర్వాత కియారా పబ్లిక్ ఈవెంట్లో మెరవడం, గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో తన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదర్‌గా బ్రేక్ తీసుకున్న కియారా మరింత గ్లామర్‌గా రెడీ అయ్యిందంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తాజా లుక్స్ ద్వారా తాను కమర్షియల్ సినిమాలకు, గ్లామర్ పాత్రలకు పూర్తిగా సిద్ధమని కియారా పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ఇక యశ్‌కు జంటగా ఆమె నటించిన ‘టాక్సిక్’ చిత్రం జూన్ 4న విడుదల కాబోతోంది.
