నిందితుల అరెస్ట్ : అఖిల ప్రియ డైరెక్షన్ లోనే కిడ్నాప్

నిందితుల అరెస్ట్ : అఖిల ప్రియ డైరెక్షన్ లోనే కిడ్నాప్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరికొంతమందిని పట్టుకున్నామన్నారు సీపీ అంజనీ కుమార్. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిపిన సీపీ.. మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ముగురు నిందితులను టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మల్లికార్జున్ రెడ్డి , బోయా సంపత్ కుమార్ (22) (భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్), బాలా చెన్నయ్య( డ్రైవర్)లను పట్టుకున్నామన్నారు. వీరి దగ్గర్నుంచీ  3 మొబైల్ ఫోన్స్ , ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కిడ్నాపర్లు ఫేక్ నెంబర్ ప్లేట్ కార్లతో వచ్చి కిడ్నాప్ చేశారని.. ఈ కేసులో అఖిల ప్రియే కీలక సూత్రధారి అన్నారు. ఆపరేన్ లో 6 సిమ్ కార్డుల ద్వారా కిడ్నాపర్లను పట్టుకున్నామన్నారు. మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి మియాపూర్ లో ఫేక్ ఐడీలతో 6 సిమ్ కార్డులు కొన్నారని..అందులో ఒక నెంబర్ అఖిల ప్రియ ఉపయోగించారన్నారు.

సిమ్ కార్డు లొకేషన్ అఖిల ప్రియ ఇంటివైపు చూపించిందన్నారు. కిడ్నాప్ కు ముందు పక్కా రెక్కీ నిర్వహించారని.. ఫేక్ నెంబర్ ప్లేట్ తో ఉన్న బైక్ పై తిరుగుతూ.. పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు తేలిందన్నారు.  అఖిల ప్రియ, బార్గవ్ రామ్, శ్రీను కిడ్నాప్ కు స్కెచ్ వేశారన్నారు. కిడ్నాపర్లు, అఖిల ప్రియ మాట్లాడుకున్నట్లు కాల్ డేటా సేకరించామని..  రాధా గ్రాండ్ హోటల్ లో కిడ్నాప్ కు స్కెచ్ వేశారని.. మొత్తం అఖిల ప్రియనే ఆపరేట్ చేసినట్లు తేలిందన్నారు. మహిళ పోలీస్ అధికారులు లేకుండా అఖిల ప్రియను అరెస్ట్ చేశారన్నది అవాస్తవమని…ఇద్దరు మహిళ అధికారుల సమక్షంలో అఖిల ప్రియ ను అరెస్ట్ చేశామన్నారు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది అఖిల ప్రియకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారని..అన్ని వైద్య పరీక్షల రీపోర్ట్ లో అఖిల ప్రియ పరిస్థితి మెరుగ్గా ఉందని వచ్చిందన్నారు. మెడికల్ రీపోర్ట్ ను కోర్టుకు సమర్పించామన్నామన్న సీపీ..  ప్రస్తుతం పోలీసుల అదుపులో కిడ్నాపర్లు ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు సీపీ అంజనీ కుమార్.