
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది చాలా మందిలో సాధారణం, కానీ అవి చాల నొప్పిని కలిగిస్తాయి. దీనికి సరైన సమయంలో ముందుగానే చికిత్స అందించకపోతే, అవి తీవ్రమైన సమస్యకు దారితియ్యొచ్చు. అయితే కిడ్నీలో అసలు రాళ్ల రావడానికి కారణం ఏంటి, కిడ్నీలో రాళ్ళూ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ముందుగానే గుర్తించొచ్చు...
ముంబైలోని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ బ్రాడూ ప్రకారం, కిడ్నీలో రాళ్ళు అంటే మూత్రపిండాలలో ఏర్పడే గట్టి, రాళ్లలాంటి పదార్థాలు.... మీకు తెలుసా ? ఈ రాళ్లు కాల్షియం, ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ వంటి వాటితో తయారవుతాయి. చిన్న రాళ్లు మనకు తెలియకుండానే మూత్రవిసర్జనలో బయటకు వెళ్లిపోవచ్చు, కానీ పెద్దవి తీవ్రమైన నొప్పి, బాధ, కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.
కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి:
*నీరు తక్కువగా తాగడం
*అధిక ఉప్పు, చక్కెర లేదా మాంసం తీసుకోవడం
*ఊబకాయం లేదా లావుగా ఉండటం
*కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
*మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు లేదా ఇన్‌ఫెక్షన్లు వంటి వ్యాధులు.
కిడ్నీలో రాళ్లు వస్తే కనిపించే లక్షణాలు:
*మీ ఛాతి వెనుక కింద పక్క భాగంలో తీవ్రమైన నొప్పి.
*ఆ నొప్పి పొత్తికడుపు కింది భాగం వరకు వ్యాపించడం
*మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి.
*మూత్ర విసర్జన రంగు మారడం
*ఎక్కువసార్లు మూత్రం విసర్జన చేయడం
*వికారం లేదా వాంతులు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించడం చాల మంచిది. కిడ్నీ రాళ్లకు చికిత్స చేయొచ్చు కానీ పట్టించుకోకపోతే తీవ్రమైన సమస్యలు వస్తాయి.
ఈ రాళ్ళు మూత్ర విసర్జన అడ్డుకుంటాయి, దీనివల్ల మూత్ర ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇంకా మూత్ర విసర్జన సమయంలో మంట, తరచుగా మూత్ర విసర్జన, నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్ర విసర్జన ఆగిపోవడం వల్ల మూత్రపిండాలలో వాపు ఏర్పడే అవకాశం ఉంది.
చిన్న రాళ్ళు ఎక్కువగా నీరు తీసుకోవడం, మందులతో బయటకు వచ్చేస్తాయి. పెద్ద రాళ్లకు షాక్ వేవ్ థెరపీ (లిథోట్రిప్సీ), యూరిటెరోస్కోపీ లేదా శస్త్రచికిత్స అవసరమవుతాయి. అంతేకాదు భవిష్యత్తులో మళ్ళీ రాళ్ళు రాకుండా ఉండడానికి లేదా కొన్ని రకాల రాళ్లను కరిగించడానికి మందులు వాడాల్సి ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్ల రాకుండా ఉండాలంటే :ప్రతిరోజూ ఎక్కువగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి, మీ ఆహారంలో ఉప్పును తగ్గించండి, నిమ్మకాయ & నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినండి, మీ బరువును చెక్ చేసుకుంటుండాలి. మీకు గతంలో రాళ్ళు ఉంటే వైద్యుడి సూచించిన మందులను వాడండి.