
డబ్బు అవసరమున్న అమాయకపు ప్రజలనే టార్గెట్ చేస్తారు. పైసలపై ఆశ చూపుతారు. కిడ్నీ ఇస్తే చాలు మీ అప్పులు అన్నీ కొట్టుకుపోతాయ్..అంటూ మాయమాటలు చెప్పి, కిడ్నీల వ్యాపారం చేస్తారు. కొన్ని సంవత్సరాలు నడుస్తున్న కిడ్నీ మాఫియా గుట్టురట్టైంది. ఇద్దరు నైజీరియన్లను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నీ ఇస్తే రూ.3 కోట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఆఫర్ చేశారు. ప్రకటన చూసి 500 మంది ముందుకొచ్చారు. రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి 500 మంది అప్లై చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని తెలిపారు పోలీసులు.