నిమ్స్ లో సెంచరీ దాటిన కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్లు..ఆరు నెలల వ్యవధిలో100 ఆపరేషన్లు సక్సెస్

నిమ్స్ లో సెంచరీ దాటిన కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్లు..ఆరు నెలల వ్యవధిలో100 ఆపరేషన్లు సక్సెస్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నిమ్స్​ యూరాలజీ విభాగం సక్సెస్​రేట్ తో రికార్డు సృష్టిస్తోంది. ఆరు నెలల వ్యవధిలో 100 కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. యూరాలజీ విభాగంలో 2015 తర్వాత  ఆపరేషన్లు గణనీయంగా పెరిగాయి. గత పదేండ్లలో హెచ్ఓడీ  డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్, యూరాలజీ టీమ్​కలిసి 1000కిపైగా కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్లను నిర్వహించారు. 

ఈ ఏడాది ఆరు నెలల్లోనే వంద ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్​రామ్​రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.