కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు నాగార్జున మిల్క్ డెయిరీ సందర్శన

 కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు నాగార్జున మిల్క్ డెయిరీ సందర్శన

కరీంనగర్ సిటీ, వెలుగు: కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ విద్యార్థులు బుధవారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాగార్జున మిల్క్ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు మాట్లాడుతూ ఫుడ్ సైన్స్ విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు ఎంతో  చాలా ముఖ్యమన్నారు. 

 విద్యార్థులకు ఏజీఎం సుధాకర్, మేనేజర్ శ్రీనివాస్.. డెయిరీ శాస్త్ర, సాంకేతిక  విధానాలను, ప్రమాణాలను, ఉత్పత్తయ్యే పాల పదార్థాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ అర్జున్ రావు , హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీ ఎన్.మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లెక్చరర్లు  అంజలి, లయ పాల్గొన్నారు.