కిమ్స్‌ సన్షైన్‌ హాస్పిటల్‌ లో పానో స్కోపీ టెక్నాలజీ... దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెడుతున్నాం: గురువారెడ్డి

కిమ్స్‌ సన్షైన్‌ హాస్పిటల్‌ లో పానో స్కోపీ టెక్నాలజీ... దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెడుతున్నాం: గురువారెడ్డి

పద్మారావునగర్, వెలుగు: ఆర్థోపెడిక్ వైద్యరంగంలో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక ‘పానోస్కోపీ’ టెక్నాలజీని దేశంలో తొలిసారిగా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ప్రవేశపెట్టారు. బుధవారం బేగంపేటలోని హాస్పిటల్‌లో ఈ టెక్నాలజీని అధికారికంగా ప్రారంభించారు. సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడారు. సంప్రదాయ ఆర్థోస్కోపీ విధానంతో పోలిస్తే పానోస్కోపీ మరింత విస్తృత దృశ్యాన్ని అందిస్తుందని తెలిపారు. లోతైన, క్లిష్టమైన సంధి గాయాలను కూడా గుర్తించే సామర్థ్యం ఉందన్నారు. 

షోల్డర్, స్పోర్ట్స్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు గుర్తించని గాయాలను సులభంగా గుర్తించి కచ్చితత్వంతో సర్జరీలు నిర్వహించవచ్చని చెప్పారు. భుజం డిస్లోకేషన్, రోటేటర్ కఫ్ చీలికలు, టెన్నిస్ ఎల్బో, మోకాలి లిగమెంట్ గాయాలు వంటి సమస్యల చికిత్సలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. చిన్న గాయాలను కూడా గుర్తించి సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని చెప్పారు.