ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని చూసి భయపడద్దు: సీనియర్ వైద్యులు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని చూసి భయపడద్దు: సీనియర్ వైద్యులు

వైద్య రంగంలో రోజు రోజుకు వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా... వైద్యులు కూడా అందుకోసం అడుగులు వేస్తున్నారు. ఐసీయూలో అత్యవసర సమయంలో రోగి ప్రాణాలను ఎలా కాపాడాలో అనే అంశంపై.. హైదరాబాద్ కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ లో యువ వైద్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. 

కామినేని, జెమ్ కేర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ హాస్పిటల్స్ కు చెందిన వంద మంది వైద్యులు పాల్గొన్నారు.

ఐసీయూలో 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న సీనియర్ వైద్యులతో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో యువ వైద్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలో వివరించారు. 

ఐసీయూలో వైద్యులు ఆందోళనకు గురికాకుండా... సరైన వైద్యం అందిస్తే చాలా క్రిటికల్ కేసులలో రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చునని సీనియర్ వైద్యులు తెలిపారు. ఇటువంటి సెమినార్స్ వల్ల వైద్యులు తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని తెలిపారు.