
విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ గ్యాంగ్‌స్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. (జులై 31న) రిలీజైన కింగ్‌డమ్.. మూడ్రోజుల్లో ఇండియాలో రూ.33.74 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా వైడ్గా సుమారు రూ.20 కోట్ల నెట్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి.
సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తుంది. మూడో రోజు శనివారం రూ.8.08 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించింది. తెలుగులో అత్యధికంగా రూ.7.39 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.53కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మూడో రోజు గ్రాస్ వసూళ్లను నేడు (అగస్ట్ 3) మధ్యాహ్నం వరకు వెల్లడించే అవకాశం ఉంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్‌డమ్
సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం:
కింగ్‌డమ్ మూవీ ఇండియాలో ఫస్ట్ డే (జులై 31న) రూ.18 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు అయిన శుక్రవారం (ఆగస్ట్1) నాడు 7.50 కోట్లు, మూడో రోజు శనివారం రూ.8.08 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించింది. తెలుగులో అత్యధికంగా రూ.7.39 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. మొత్తంగా కింగ్‌డమ్ మూడ్రోజుల్లో ఇండియాలో రూ.33.74 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కించించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
(అగస్ట్ 2) శనివారం, కింగ్‌డమ్ మొత్తం తెలుగు ఆక్యుపెన్సీని 41.54 శాతంగా నమోదు చేసింది. ఉదయం షోలకు 31.25 శాతం ఓటింగ్‌ను నమోదు చేయగా, మధ్యాహ్నం 46.31 శాతం, సాయంత్రం 47.06 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో కింగ్‌డమ్ బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని నిలుపుకుంటూ వెళ్తుంది. మరి ఈ వీకెండ్ మొత్తంలో కింగ్‌డమ్ ఎలాంటి వసూళ్లు సాధించనుందో చూడాలి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్:
కింగ్‌డమ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీన్ని బట్టి చూస్తే.. సినిమాకు రూ.53.50 కోట్ల నెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాల్సి ఉంది. రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.