పంజాబ్ పంజా విసిరేనా..

పంజాబ్ పంజా విసిరేనా..

మొహాలి: బౌలర్ల సారథ్యంలో సాగుతున్న రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. విలియమ్సన్‌ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన భువనేశ్వర్ కుమార్‌ ఓ వైపు.. సుదీర్ఘ కాలంగా ధోనీ సహవాసంతో అపార అనుభవం గడించిన అశ్విన్‌ మరోవైపు. ఓపెనర్ల జోరుకు తోడు బౌలింగ్‌ బలంతో ముందుకు సాగుతున్న సన్​రైజర్స్‌ హైదరాబాద్‌ .. టాపార్డర్‌ నిలకడతో పాటు మ్యాజిక్‌ స్పెల్స్‌ తో మ్యాచ్‌ లు గెలుస్తూ వస్తున్న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరగనుంది.ఇరు జట్లు ఆడిన ఐదు మ్యాచ్‌ ల్లో మూడేసి విజయాలతో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నా యి.వరుస విజయాల తర్వాత లాస్ట్‌ మ్యాచ్‌ ల్లో ఓటమిపాలైన రెండు టీమ్‌లు మళ్లీ గెలుపు బాటపట్టాలనే ఉత్సాహంతో సమరానికి సై అంటున్నా యి.

ఓపెనర్లే సన్ రైజర్స్ బలం

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ తో జరిగిన గతమ్యాచ్‌ లో ఈజీ టార్గెట్‌ ఛేజ్‌ చేయలేక సన్‌ రైజర్స్‌చతికిలపడింది. సీజన్‌ ఆరంభం నుంచి మంచిస్టార్టింగ్‌ ఇస్తూ వస్తున్న ఓపెనింగ్‌ జోడీ తడబడటంతో పాటు కీలక సమయంలో సత్తాచా టాల్సినమి డిలర్డర్‌ చేతులెత్తేయడంతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అరంగేట్ర ఆటగాడు అల్జారి జోసెఫ్‌‌ ధాటికి హైదరాబాద్‌ లీగ్‌ లోనే తమ అత్యల్పస్కోరు (96) నమోదు చేసి ఓడింది. తొలి మూడుమ్యాచ్‌ ల్లో 3 సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన వార్నర్‌ , బెయిర్‌ స్టో జోడీ మరోసారిసత్తా చాటాలని మెనేజ్‌ మెంట్‌ ఆశిస్తోంది. ఓపెనర్ల మెరుపుల మధ్య కనుమరుగైన మిడిలార్డర్‌ డొల్లతనం ముంబై మ్యాచ్‌ లో తేటతెల్లమైంది.ఓపెనర్ల తర్వాత విజయ్‌‌ శంకర్‌ కాస్త ఫర్వాలేదనిపిస్తుంటే.. మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా,యూసుఫ్‌‌ పఠాన్‌ ఇప్పటివరకు తమ పాత్రకుతగిన న్యాయం చేయలేకపోయారు. వారు కూడాఓ చేయి వేస్తే.. రైజింగ్‌ పెద్ద కష్టం కాబోదు. పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌ తో ముందుకు సాగుతున్న హైదరాబాద్‌ బౌలింగ్‌ ను ఎదుర్కోవడం ఎంత పెద్దజట్టుకైనా కష్టమే అనడంలో ఎలాంటి సందేహంలేదు. సీనియర్‌ పేసర్‌ , స్టాండిన్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌కుమార్‌ తో పాటు సందీప్ శర్మ, సిద్ధార్థ్‌‌ కౌల్‌ సత్తాచాటుతుం టే.. రషీద్‌ ఖాన్‌ , మహ్మద్‌ నబీ స్పిన్‌భారం మోస్తూ వస్తున్నారు. విజయ్‌‌ శంకర్‌ ను ఆల్‌ రౌండర్‌ కోటా కింద తీసుకున్న రైజర్స్‌ కుఇంతవరకు అతడితో బౌలింగ్‌ వేయించాల్సి న అవసరం రాలేదంటే.. హైదరాబాద్ బౌలింగ్‌ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాహుల్‌ పైనే భారం

సీజన్‌ ఆరంభంలోనే మన్కడింగ్‌ తో వార్తల్లోకెక్కినకింగ్ స్‌ లెవెన్‌ పంజాబ్‌ ఆ తర్వాత పెర్ఫార్మెన్స్‌ లోనూ ఆకట్టుకుం ది. ఆరంభంలో యూనివర్సల్‌ బాస్ క్రిస్‌‌ గేల్‌ బ్యాట్‌ తో మెరుపులు మెరిపిస్తే.. ఆతర్వాత రాహుల్‌ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.సర్ఫరాజ్‌ , మయాంక్ అగర్వాల్‌ కూడా టచ్‌ లోఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌ లో నిధానంగా ఆడినరాహుల్‌ , సర్ఫరాజ్‌ హాఫ్‌‌ సెంచరీలైతే చేయగలిగారు కానీ టీమ్‌ ను గెలిపించలేకపోయారు. సాధించాల్సి న రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ఒత్తిడికిలోనై కీలక సమయంలో వికెట్లు సమర్పించు కోవడంతో ఓటమి తప్పలేదు. గాయంతో ఇబ్బందిపడుతున్న గేల్‌ స్థానంలో ఆడిన ఇంగ్లం డ్‌ ఆల్‌ రౌండర్‌ స్యామ్‌ కరన్‌ సీజన్‌ లో తొలి హ్యాట్రిక్‌ తో జోరు మీదున్నాడు. మహ్మద్‌ షమీ, ఆండ్రూటై, రవిచంద్రన్‌ అశ్విన్‌ , మురుగన్‌ అశ్విన్‌ తోబౌలింగ్‌ లో మంచి వేరియేషన్స్‌ ఉన్నాయి.ముఖ్యంగా సూపర్‌ ఫామ్‌ లో ఉన్న షమీ ఎక్కువ వికెట్లు తీయకున్నా .. కట్టుదిట్టమై న బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌ మెన్‌ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. మిడిలార్డర్‌ లో మయాంక్‌ , మిల్లర్‌ , మన్‌ దీప్‌ ,సర్ఫరాజ్‌ మరింత రెస్పాన్సి బిలిటీ తీసుకుంటే కింగ్స్‌ కు ఎదురుండదు.

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్‌ : వార్నర్‌ , బెయిర్‌ స్టో , శంకర్‌ ,పాండే, హుడా, పఠాన్‌ , విలియమ్సన్‌ /నబీ,రషీద్‌ , భువనేశ్వర్‌ , సందీప్‌ , కౌల్‌ .

పంజాబ్‌ : రాహుల్‌ , మయాంక్‌ , మిల్లర్‌ , మన్‌ దీప్‌ ,సర్ఫరాజ్‌ , గేల్‌ /స్యామ్‌ కరన్‌ , ముజీ బ్‌ , అశ్విన్‌ ,

మురుగన్ అశ్విన్‌ , టై, షమీ.