కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఓపెన్

కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఓపెన్
  • పర్యాటకుల తాకిడి 

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 407 అడుగులకు చేరడంతో అధికారులు అత్యవసరంగా 5 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు కిన్నెరసాని ప్రాజెక్టును చూసేందుకు తరలిచ్చారు. కాగా పర్యాటకులను ప్రాజెక్టుపైకి అనుమతించకపోవడంతో నిరాశ చెందారు. 

తాలిపేరు ప్రాజెక్టుకు వరద..

భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తాలిపేరు ఉపనది పరివాహక ప్రాంతంలోని ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వస్తోంది. సోమవారం  తాలిపేరు ప్రాజెక్టు10 గేట్లను రెండు అడుగుల ఎత్తి 22,065 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి వదిలారు.