KiranAbbavaram: మరో లవ్ ఫెయిల్యూర్ కథతో ‘బేబీ’ డైరెక్టర్.. ఆసక్తిగా ‘చెన్నై లవ్‌‌స్టోరీ’ గ్లింప్స్‌

KiranAbbavaram: మరో లవ్ ఫెయిల్యూర్ కథతో ‘బేబీ’ డైరెక్టర్.. ఆసక్తిగా ‘చెన్నై లవ్‌‌స్టోరీ’ గ్లింప్స్‌

కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. దర్శకుడు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు ఎస్‌‌కేఎన్‌‌తో కలిసి నిర్మిస్తున్నాడు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్.

సోమవారం ఈ మూవీ టైటిల్‌‌ను రివీల్ చేశారు. ‘చెన్నై లవ్‌‌స్టోరీ’ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌‌తో పాటు గ్లింప్స్‌‌ రిలీజ్ చేశారు. సముద్రపు ఒడ్డున కూర్చున్న హీరోహీరోయిన్స్‌‌ మధ్య సాగే సంభాషణతో కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది.

‘ఫస్ట్ లవ్‌‌ ఫెయిల్ అయితే నరకం. అందులో స్వచ్ఛత, నిజాయితీ ఉంటాయి. ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ..’తొలిప్రేమ గురించి గొప్పగా చెబుతుంటుంది హీరోయిన్. తొలిప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదా అంటాడు హీరో.

చరిత్రలో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి.. వాళ్లందరికీ అవి మొదటి ప్రేమలైతే కాదని, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే.. బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని హీరో చెప్పే డైలాగ్స్‌‌ ద్వారా మూవీ కాన్సెప్ట్‌‌ ఏమిటో తెలియజేశారు. కిరణ్‌‌ మేకోవర్‌‌‌‌తో పాటు మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.