ప్రేక్షకుల ప్రేమే మా విజయానికి సంకేతం

ప్రేక్షకుల ప్రేమే మా విజయానికి సంకేతం

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌‌‌‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహించగా,  సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్‌‌‌‌కేఎన్‌‌‌‌తో కలిసి  నిర్మించారు.  జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం   ప్రీమియర్లు, తొలి రోజు కలిపి  ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్లు వసూళ్లు సాధించిందని మేకర్స్ తెలియజేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన  సక్సెస్‌‌‌‌మీట్‌‌‌‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘సినిమా ప్రారంభం నుంచే ఇది మంచి విజయం సాధిస్తుందని నమ్మాం. 

ప్రేక్షకులు  ఆ నమ్మకాన్ని నిజం చేశారు.   స్టీవెన్ శంకర్ పాత్ర నా కెరీర్‌‌‌‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అని అన్నాడు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ జీవితాంతం గుర్తుండిపోతుందని హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ చెప్పింది. దర్శకుడిగా నా తొలి చిత్రానికే  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని రవి నంబూరి అన్నాడు.  ‘బేబి’  తర్వాత మరింత బాధ్యతతో రూపొందించిన చిత్రమిది అని ఎస్‌‌‌‌కేఎన్ అన్నారు.  

మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని సాయి రాజేష్​ అన్నాడు. రెండేళ్ల కష్టానికి ప్రేక్షకుల ప్రేమే ప్రతిఫలమని  కో-ప్రొడ్యూసర్  ధీరజ్ మొగిలినేని అన్నారు.  ఈ కార్యక్రమంలో నటులు త్రిగుణ్, మహేందర్, నటి ప్రమోదిని తదితరులు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని  ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.