
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇందులో మాస్ యాటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించాడు. మలయాళంలో ఎల్లారుక్కం నమస్కారం అంటూ ‘ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు..’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్‌లో తను ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
‘మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ల సినిమాల్లో ఉండే అథెంటిసిటీ మన సినిమాల్లో ఉండదు. మనిద్దరి ప్రేమ ఏమైనా పర్లేదు.. ఫ్రేమ్ మాత్రం బాగుండాలి..’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.