Kiran Abbavaram-Rahasya: ఒక్కటైన కిరణ్‌ అబ్బవరం-రహస్య..పెళ్లి ఫోటోలు చూశారా?

Kiran Abbavaram-Rahasya: ఒక్కటైన కిరణ్‌ అబ్బవరం-రహస్య..పెళ్లి ఫోటోలు చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి గురువారం (ఆగస్ట్ 22న) ఘనంగా జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ లోని ఓ ప్రవేట్ రిసార్ట్స్ లో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం.

రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే వీరిమ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం. దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్య ప్రేమాయ‌ణం సాగించిన ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే..రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు.చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్,ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో..చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు.

Also Read:-చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్..కథ, కథనం బాగుంటే హిట్ పడాలంతే

ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని తాజాగా  కొత్త సినిమా 'క'నుంచి టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.