AAY Collection: చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్..కథ, కథనం బాగుంటే హిట్ పడాలంతే

AAY Collection: చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్..కథ, కథనం బాగుంటే హిట్ పడాలంతే

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె మ‌‌ణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆయ్‌‌’.  అల్లు అరవింద్ సమర్పణలో  బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదలైంది.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌‌‌‌ టైనర్ తో, స్నేహం, కులవ్యవస్థ వంటి అంశాలతో తెరకెక్కి ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

Also Read:-ఒక్కటైన కిరణ్‌ అబ్బవరం-రహస్య..పెళ్లి ఫోటోలు చూశారా?

ఫస్ట్ వీక్ లో అన్ని చోట్లా కలిపి రూ.9 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించి శభాష్ అనిపించింది.ప్రస్తుతం రెండవ వారంలో అడుగుపెట్టింది. ఇప్పటికీ చాలా థియేటర్స్ లో ఆయ్ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఆయ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ.3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. రిలీజ్ అయినా 5 రోజులకే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇదిలా ఉంటే, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ వంటి పెద్ద హీరోల సినిమాలపై చిన్న మూవీగా విడుదలై వాటికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఆయ్ మూవీ. అల్లు అర్జున్ బ్రదర్ లాంటి బన్నీ వాసుకు రూ. 1.50 కోట్లకు పైగా లాభాలు దక్కాయి.