నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వారల్లో హాట్ టాపిక్ గా మారారు. ఒక వైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి.. మరో వైపు బాలీవుడ్ లో ఈ బ్యూటీ చేయబోతున్న బోల్డ్ పాత్ర. ఈ రెండు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రష్మిక ఒక ప్రయోగాత్మకమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది ఆమె కెరీర్ లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
షాకింగ్ రోల్..
హోమీ అదజానియా దర్శకత్వంలో రాబోతున్న 'కాక్‌టెయిల్ 2' చిత్రంలో రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో రష్మిక , కృతి సనన్ 'స్వలింగ సంపర్కులు' (Lesbian Couple) గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. నెట్టింట రష్మిక, కృతి సనన్ పాత్రలపై చర్చనీయాంశంగా మారింది.
కథా నేపథ్యం
ఒక మోడ్రన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, రష్మిక-కృతిల మధ్య ఉండే రిలేషన్‌షిప్‌ను కుటుంబ సభ్యుల నుండి కాపాడేందుకు షాహిద్ కపూర్ వారి బాయ్‌ఫ్రెండ్‌గా నటించాల్సి వస్తుందని సమాచారం. సాధారణంగా సౌత్ ఇండియాలో స్టార్ హోదాలో ఉన్న ఏ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్రలు చేయడానికి సాహసించరు. కానీ రష్మిక మాత్రం నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఈ బోల్డ్ రోల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
రాజస్థాన్ వేదికగాపెళ్లి!
సినిమాల సంగతి పక్కన పెడితే, రష్మిక వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద శుభకార్యానికి సమయం ఆసన్నమైంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంట ఎట్టకేలకు ఒకటవ్వబోతున్నారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయపూర్‌ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఇంటిని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.
వరుస సినిమాలతో..
పెళ్లి తర్వాత కూడా రష్మిక తన సినీ ప్రయాణాన్ని జోరుగా కొనసాగించనుంది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవర కొండతో కలిసి 'రానబలి' మూవీతో పాటు మైసా మూవీలో నటించనుంది. అటు పుష్ప 3 (The Rampage): సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది.అటు బాలీవుడ్ లో 'కాక్‌టెయిల్ 2' లో నటిస్తోంది. ఒకవైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే, మరోవైపు నటిగా 'కాక్‌టెయిల్ 2' వంటి భిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్న రష్మికను చూస్తుంటే ఆమె డెడికేషన్ అర్థమవుతోంది. మరి ఈ 'బోల్డ్' క్యారెక్టర్‌లో రష్మికను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
